రిస్క్ చేసిన రాజ గోపాల్….ఏమవునో…?

Lagadapati Rajagopal Survey On Telangana Elections 2018

ఎన్నికలకు ముందు లగడపాటి సర్వే సృష్టించిన దుమారం అంతా ఇంతా కాదు. ప్రజా కూటమి వైపు ప్రజల మొగ్గు ఉందని లగడపాటి చేసిన సర్వే రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. అయితే ఎన్నికల తర్వాత మీడియా ముందుకు వచ్చిన లగడపాటి తన ఫైనల్ నంబర్స్ ప్రకటించారు. అయితే ఇప్పటివరకు తాను జరిపిన సర్వేలో అన్నింటిలోకి ప్రజా నాడి పట్టుకోవడంలో అత్యంత కష్టపడిన ఎన్నిక ఇదేనని లగడపాటి ప్రకటించారు. ప్రజల్లో కూడా అటూ ఇటూ ఊగిసలాట కనిపించిందని అందుకే దాదాపు మూడు నెలలపాటు కష్టపడినా కూడా ప్రజల నాడి పట్టుకోవడంలో కాస్త ఇబ్బంది ఎదురైంది అని లగడపాటి అన్నారు. మొత్తం మీద దాదాపు 72 శాతం ఓటింగ్ నమోదయింది అని చెప్పిన లగడపాటి, అధికారిక లెక్కల ప్రకారం ఓటింగ్ శాతం ఎంత ఉందన్నది ఇంకా తెలియాల్సి ఉంది అని చెప్పారు.
ప్రజా కూటమి : 55 -75 ( 65 + లేదా -10)
ప్రజా కూటమిలోని టిడిపి : 5-9 (7+ లేదా-2)
టిఆర్ఎస్: 25-45 ( 35 + లేదా – 10)
బిజెపి : 5-9 ( 7 + లేదా – 2)
ఎంఐఎం : 6-7

lagadapati-raj-gopal
ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు మొగ్గు చూపారని లగడపాటి సర్వే ప్రకారం అర్థమవుతోంది. అయితే లగడపాటి రాజగోపాల్ తెలంగాణ ఎన్నికల సర్వేలతో రిస్క్ చేసారనే చెప్పాలి. ఎందుకంటే తన సర్వేలపై ఉన్న నమ్మకం ఎలాంటిదో ఆయనకు బాగా తెలుసు. దాదాపుగా పాతికేళ్ల నుంచి ఆయన సర్వేలు అన్నీ కచ్చితత్వానికి మారుపేరుగా నిలిచాయి. అనేక సార్లు జాతీయ సర్వే సంస్థలు ప్రకటించిన వాటికి లగడపాటి రాజగోపాల్ ప్రకటించిన వాటికి చాలా తేడా ఉంది. ఆ సందర్భాల్లో జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ తప్పయ్యాయి. కానీ లగడపాటివి మాత్రం ఒక్క చెన్నై మినహా మిగతావన్నీ కరెక్ట్ అయ్యాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అయితే ఎప్పుడూ సరైన ఫలితాలను ఉత్తరాది చానళ్లు ప్రకటించలేదు. చివరికి గత ఏపీ ఎన్నికల్లోనూ వైసీపీనే గెలుస్తుందని ఆయా చానళ్లు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. అప్పుడు కూడా కేవలం లగడపాటి ఒక్కరే బాబు ప్రభుత్వమే వస్తుందని చెప్పారు. ఆ సంగతి పక్కన పెడితే ఇటీవలి కాలంలో కూడా ఉత్తరాది సర్వే సంస్థలు తప్పులో కాలేశాయి. కర్ణాటకలో ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా వాస్తవ పరిస్థితిని అంచనా వేయలేకపోయింది. అలాగే నంద్యాల ఉపఎన్నికల్లో కానీ కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తన ఉత్తరాది టీంతో చేయించిన సర్వేల్లో వైసీపీనే గెలుస్తుదని తేల్చారు. అందుకే జగన్ నంద్యాల ఎన్నికల్లో పోటీకి సిద్ధపడ్డారు.

telangana-elections-updates

కానీ లగడపాటి మెజార్టీతో సహా చెప్పారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లోలానే నంద్యాల ఎన్నికల్లో కూడా ఎవరిదో విజయం అని ఊహించలేని పరిస్థితి ఉంది. నిజానికి జగన్ రెండు వారాలు నంద్యాల్లోనే మకాం వేసి గల్లీ గల్లీ తిరిగారు. నేతలందర్నీ మోహరించిన తర్వాత హోరాహోరీ పోరు జరుగుతుందని అనుకున్నారు. కానీ లగడపాటి రాగోపాల్ మాత్రం ఆర్జీ ప్లాష్ టీం ద్వారా సర్వే జరిపి టీడీపీకి 27 వేల ఓట్ల మెజార్టీ వస్తుందని చెప్పారు. ఫలితాల్లో అదే నిజం అయింది. ఇప్పుడు ఒక్క జాతీయ టీవీ చానల్ కూడా టీఆర్ఎస్ ఓడిపోతుందని చెప్పలేదు. లగడపాటి రాజగోపాల్ మాత్రమే చెబుతున్నారు. ఇప్పటి వరకూ లగడపాటి రాజగోపాల్ సర్వేలంటే అందరికీ ఎనలేని నమ్మకం. రాజగోపాల్ ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగా ఫలితాలు వస్తే లగడపాటి విశ్వసనీయత అమాంతం పెరుగుతుంది. లేకపోతే ఎంతో కాలం నుంచి తెట్టి పెట్టుకున్న నమ్మకం కోల్పోయినట్టే, పెప్పర్ స్ప్రే ఘటనను ఉటంకిస్తూ ఆయనను ఇప్పటికీ తెలంగాణ వ్యతిరేకిగా టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తూ ఉంటారు. ఎగ్జిట్ పోల్స్ తప్పయితే ఈ ముద్ర మరింత బలంగా పడుతుంది. మరి తుది ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది తేలాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.