పెళ్లి చేసుకోను..డేటింగ్ చేయను కానీ నా లైఫ్ లో ఒకరుంటారు !

Lakshmi Menon talks about marriage life

ఈ మధ్య కాలంలో నటీమణులు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇదే విషయాన్ని ఒక నటీమణి ముందు ప్రస్తావిస్తే పెళ్లి చేసుకుంటేనే ప్రేమాభిమానాలు లభిస్తాయంటే నేను ఒప్పుకోను. పెళ్లి చేసుకోకపోయినా అవి పొందవచ్చు. వ్యక్తిగతంగా నాకు వివాహ బంధంపై నమ్మకం లేదు. నేను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకోవడం లేదు’ అని 15 ఏళ్ల వయసులోనే సినీ రంగంలో అడుగుపెట్టి, సక్సెస్ ఫుల్ నటిగా గుర్తింపు పొందిన నటి లక్ష్మీమీనన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. వివాహబంధంపై తనకు నమ్మకం లేదని… పెళ్లి చేసుకోనంటూ ఆమె స్పష్టం చేసింది. అలాగని, తన జీవితంలో అండగా ఎవరూ ఉండరని అనుకోవద్దని, జీవితంలో కచ్చితంగా ఒకరు ఉంటారని అలా అని అది లివింగ్ రిలేషన్ కూడా కాదని ఆమె చెప్పుకొచ్చింది.

అతనికి చాలా నమ్మకం, ప్రేమాభిమానాలు ఉండాలని తమ దాన్ని ఎలా వర్ణించాలో తనకు అర్థం కావడం లేదని చెప్పింది. పెళ్లి చేసుకుంటేనే ప్రేమ, అభిమానం లభిస్తాయని తాను భావించడం లేదని… పెళ్లి చేసుకోకపైనా వాటిని పొందవచ్చని తెలిపింది. జీవితంలో అనుభవమే ఉత్తమ ఉపాధ్యాయుడని, కాగా తాను పెళ్లి గురించి చెప్పిన విషయాలు అనుభవాలే కారణం అని చెప్పనని, దాన్ని ఎలా చెప్పాలో కూడా నిజానికి తనకు తెలియదని చెప్పింది. 15 ఏళ్ల వయసులోనే నటిగా పరిచయమైన ఈ కేరళ కుట్టి కుంకీ చిత్రంతో కోలీవుడ్‌ లో జెండా పాతింది. ఆ తరువాత విశాల్, విజయ్‌సేతుపతి, జయంరవి వంటి స్టార్‌ హీరోలతో జతకట్టి సక్సెస్‌ఫుల్‌ నాయకిగా స్టార్ హీరోయిన్స్ సరసన నిలబడింది. కెరీర్ మంచి ఊపు మీదున్న సమయంలో చదువు పూర్తి చేయాలంటూ నటనకు గ్యాప్‌ తీసుకుంది. ఆ నిర్ణయం సినీకెరీర్‌కు నష్టాన్నే కలిగించింది. రీఎంట్రీ అయినా మునుపటిలా కాలం కలిసి రావట్లేదు. ప్రస్తుతం ప్రభుదేవాతో జంటగా నటిస్తున్న యంగ్‌ మంగ్‌ ఛంగ్‌ చిత్రం ఒక్కటే చేతిలో ఉంది. ఈ చిత్రం లక్ష్మీమీనన్‌కు ఎలాంటి రిజల్ట్‌ ఇస్తుందో చూడాలి.