Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాలయ్య, వర్మ కాంబినేషన్ లో ఎన్టీఆర్ బయోపిక్ వార్త బయటికి రాగానే లక్ష్మీపార్వతి గొంతు విప్పారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటించకూడదని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ సినీ జీవితం గురించి అయితే సినిమాలో ఆ పాత్రకి బాలకృష్ణ సరిపోతాడు గానీ రాజకీయాల ప్రస్తావన ఉంటే మాత్రం ఆయన ఆ రోల్ కి సరిపోడని లక్ష్మీపార్వతి అంటున్నారు. అసలే బాలయ్య మొహం అమాయకంగా ఉంటుందని, రాజకీయాల్లో ఎన్టీఆర్ ని పదవి నుంచి దించే సీన్ లో బావ చంద్రబాబు గురించి చెప్తుంటే బాలయ్య ఇబ్బంది పడతాడని లక్ష్మీపార్వతి అంటున్నారు. అందుకే అంత బరువు బాలయ్య మీద పెట్టడం కన్నా వేరే నటుడిని ఆ పాత్ర కోసం తీసుకుంటే బాగుంటుందని ఆమె సూచించారు.
లక్ష్మీపార్వతి వ్యాఖ్యలపై నందమూరి ఫాన్స్ నిప్పులు చెరుగుతున్నారు. ఎన్టీఆర్ పాత్రకి బాలయ్య సరిపోడని చెప్పడానికి లక్ష్మీపార్వతి ఎవరని నిలదీస్తున్నారు.
మరిన్ని వార్తలు