లక్ష్మీ రాయ్ ప్రెగ్నెంట్ అట, అదేంటీ పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ ఏంటి ? అనే విషయాన్ని హైలైట్ చేస్తూ ఓ తమిళ వెబ్ సైట్ లక్ష్మీరాయ్ని తల్లిని చేసేసింది. అసలే ఆడపిల్ల అందునా హీరోయిన్ కదా అదీ కాక ఆమె నటించిన ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ మూవీ విడుదలకు రెడీగా ఉంది. దీంతో రాయ్ లక్ష్మీ ప్రెగ్నెంట్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ట్విట్టర్లో షేర్లు కామెంట్, లైక్లు వస్తుండటంతో ఖంగుతిన్న రాయ్ లక్ష్మీ తీవ్రంగా స్పందించింది. ఇష్టం వచ్చినట్టు వార్తలు రాసేస్తారా అంటూ సదరు వెబ్ సైట్లను పేరు పెట్టి మరీ తిట్టిపోసింది. “మీ వ్యూలు, క్లిక్ల కోసం ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి స్టోరీలు రాసేస్తారా? అసలు ఇంత కాన్ఫిడెంట్గా ఆర్టికల్స్ ఎలా రాస్తున్నారు. ఈ వార్త ఎవరు రాసారో నాకు తెలీదు కానీ, అతడికి నేనంటే ఇష్టం లేనట్టుగా ఉంది. నన్ను అడిగితే ఇంతకంటే మంచి స్టోరీ ఇచ్చేదాన్ని” అంటూ సదరు తమిళ మీడియా సంస్థపై విరుచుకుపడింది లక్ష్మీరాయ్. ఈ వార్తని తన దృష్టికి తీసుకొచ్చిన వ్యక్తికి కృతజ్ఞతలు చెబుతూనే దేనికైనా ఓ హద్దు ఉంటుందనీ, ఇకనైనా అర్థవంతమైన వార్తలు అందించమంటూ చురకలంటించింది. మళ్లీ మళ్లీ ఇది రిపీటైతే లీగల్ నోటీసులు పంపి తేల్చుకుంటానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. తెలుగులో ‘కాంచనమాల కేబుల్ టీవీ’ సినిమాతో పరిచయమైన లక్ష్మీరాయ్ ఖైదీ నెం.50 చిత్రంలో రత్తాలు రత్తాలు ఐటమ్ సాంగ్ తో ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం ఆమె లీడ్ రోల్లో నటించిన ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ’ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.