కోలీవుడే తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ చిత్రం “జైలర్” భారీ సక్సెస్ అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం గ్రాండ్ సక్సెస్ అందుకోగా ఈ చిత్రం గ్రాండ్ సక్సెస్ అందుకోగా ఈ చిత్రం చూసేందుకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే వీరి కలయికలో రజినీకాంత్ యోగి ఆదిత్యనాథ్ కాళ్లకు నమస్కారం చేయడం అనేది పెద్ద రచ్చకు దారి తీసింది.ఇంట్రస్టింగా ఇందులో ఎక్కువ రియాక్ట్ అయ్యింది కూడా తెలుగు వాళ్లే ఎక్కువ గా ఉన్నారు. ఇక ఈ అంశంపై అయితే లేటెస్ట్ గా రజిని సాలిడ్ క్లారిటీ ఇచ్చారు..
ఓ మీడియా ఇంటరాక్షన్ లో మాట్లాడుతూ తాను ఓ యోగి అయినా సన్యాసికి అయినా కూడా తన కన్నా పెద్ద వయసు వారా చిన్న వారా అని చూడడం అలవాటు లేదు అని వారి కాళ్లకు నేనెప్పుడూ అలానే నమస్కరిస్తాను అని సింపుల్ గా నవ్వుతూ చెప్పేసారు. దీనితో తలైవర్ విషయంలో ఏదేదో మాట్లాడిన వారికి ఓ చక్కని క్లారిటీ రజినీ నుంచే వచ్చినట్టు అయ్యింది అని చెప్పాలి.