నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ డ్రామా “భగవంత్ కేసరి” ఈ…. విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం ఇప్పుడు షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రమోషన్స్ స్టార్ట్ చేసుకుంటుంది. ఇక లేటెస్ట్ గా అయితే యంగ్ హీరోయిన్ శ్రీలీల ఈరోజు నుంచే సలాది ప్రమోషన్స్ ని స్టార్ట్ చేస్తూ రంగంలోకి దిగింది
మరి భగవంత్ కేసరి నుంచి దీనితో పాటుగా మరో సాలిడ్ అప్డేట్ అయితే బయటకి వచ్చాయి . ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నేషనల్ అవార్డు విన్నింగ్ నటుడు అర్జున్ రాంపాల్ ని అయితే రాహుల్ సంగ్వి గా పరిచయం చేస్తూ మేకర్స్ తన ఫస్ట్ లుక్ పాత్రని రివీల్ చేసేసారు. మరి తాను అయితే ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ డాన్ గా కనిపించబోతున్నాడు అని లుక్ చూస్తే అర్ధం అవుతుంది. ఇక ఈ సినిమా అవైటెడ్ ట్రైలర్ కోసం ఇప్పుడు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.