మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “దేవర” తో మంచి హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. అరవింద సమేత మూవీ తర్వాత తన నుంచి డైరెక్ట్ గా వచ్చిన సినిమా ఇది కాగా ఈ సినిమా తర్వాత పలు సెన్సేషనల్ సినిమాలతో తాను బిజీగా ఉన్నాడు. మరి ఈ సినిమా ల్లో పాన్ ఇండియా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కూడా ఒకటని తెలిసిందే.
దీనిపై కూడా నెక్స్ట్ లెవెల్ హైప్ ఉండగా ఈ మూవీ నుంచి రానున్న రోజుల్లో ఒక క్రేజీ ట్రీట్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనితో సినిమా టైటిల్ ను అయితే మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా అనౌన్స్ చేయనున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. ఆల్రెడీ ఈ మూవీ కి “డ్రాగన్” అనే పవర్ఫుల్ టైటిల్ పరిశీలనలో ఉందనే టాక్ ఉన్న సంగతి తెలిసిందే. మరి దీనినే అనౌన్స్ చేస్తారా లేక వేరే ఏమన్నా ఉంటుందా అనేది మాత్రం చూడాలి.