దక్షిణాఫ్రికా మాజీ ఉమెన్స్ క్రికెటర్ లారెన్ ఏజెన్ బాగ్ వరల్డ్ కప్ క్వాలిఫయర్ ఫైనల్ మ్యాచ్‌లకి అంపైర్‌గా కొనసాగారు. వరల్డ్ కప్ క్వాలిఫయర్ ఫైనల్ మ్యాచ్లకె కాకుండా ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు అంపైర్ గా వ్యవహరించారు.
ఈ మాజీ ఉమెన్స్ క్రికెటర్ పురుషుల ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌కు కూడా అంపైర్‌గా వ్యవహరించ బోనున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి-ఐసీసీ దక్షిణాఫ్రికా ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌కు లారెన్ ఏజెన్బాగ్ను అంపైర్‌గా నియమించబోనునది. పురుషుల ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌కు ఎంపికైన తొలి మహిళా అంపైర్‌గా లారెన్ ఏజెన్‌బాగ్ ఘనత చెందారు. లారెన్ ఏజెన్‌బాగ్ ఐసీసీ మహిళా అంపైర్ల ప్యానల్లో సభ్యురాలిగా ఉన్నారు.
ఈ సందర్బంగా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తాత్కాలిక డైరెక్టర్ కోరీ వాన్ జిల్ మాట్లాడుతూ తన ప్రతిభను ప్రపంచానికి చూపించిన లారెన్ ఇంకా కొన్ని కలలను నెరవేర్చుకోవాలని, ఒక స్ఫూర్తిగా మిగతా మహిళా క్రికెటర్లకు నిలిచిపోతుందని తెలుపుతూ ప్రశంసించారు. ఏజెన్‌బాగ్ లారెన్ స్టాండర్డ్ మహిళా అంపైర్‌గా తన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.