త్వరలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో అతడు ఏడడుగులు వేయబోతున్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ ప్రస్తుతం హాలీడే ట్రిప్‌లో ఉన్నారంటూ వదంతులు పుట్టుకురాగా ఒక్క ఫొటోతో వీటికి చెక్ పెట్టింది లావణ్య. ప్రస్తుతం తాను డెహ్రాడూన్‌లో ఫ్యామిలీతో ఉన్నానంటూ ఫొటోలు పోస్ట్ చేసి గాసిప్‌లకు అడ్డుకట్ట వేసింది.
వరుణ్, లావణ్య ఇద్దరూ ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ చిత్రాల్లో నటించారు. ఆ సినిమాల సమయంలోనే వీరిద్దరూ లవ్‌లో పడ్డారని, పెళ్లి కూడా చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ అప్పట్లోనే వార్తలొచ్చాయి. పైగా వరుణ్ చెల్లెలు నిహారిక పెళ్లిలోనూ లావణ్య కనిపించడంతో ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చినట్లైంది.
తాజాగా వరుణ్ తన బర్త్‌డే రోజు బెంగళూరు వెళ్లాడు. అయితే అతడు లావణ్య కోసమే అక్కడికి వెళ్లాడని, డైమండ్ రింగ్ ఇచ్చి ఆమెకు ప్రపోజ్ చేయబోతున్నాడంటూ పుకార్లు మొదలయ్యాయి. ఈ విషయం తెలిసిన లావణ్య ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఫొటోలు షేర్ చేస్తూ.. ‘ప్రస్తుతం డెహ్రాడూన్‌లో ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతున్నా. మా ఊరి అందాలను ఆస్వాదిస్తున్నాను’ అని రాసుకొచ్చింది. దీంతో వరుణ్ ప్రపోజల్, పెళ్లి అంటూ వచ్చిన వార్తలకు చెక్ పడినట్లైంది.