హాకీ ప్లేయర్ గా మారిన లావణ్య త్రిపాఠి

హాకీ ప్లేయర్ గా మారిన లావణ్య త్రిపాఠి

ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో హీరో పాత్రలకు తగ్గట్లుగా, హీరోయిన్ పత్రాలు కూడా దీటుగా ఉంటున్నాయి. అయితే ప్రస్తుతం లావణ్య త్రిపాఠి యంగ్ హీరో సందీప్ కిషన్ తో కలిసి ఏ1 ఎక్ష్ప్రెస్స్ చిత్రంలో నటిస్తుంది. అయితే ఏ చిత్రంలో లావణ్య త్రిపాఠి హాకీ ప్లేయర్ గా కనిపించనుంది. అయితే ఈ పాత్రలో బాగా కనిపించేందుకు శిక్షణ కూడా తీసుకుంటుంది. అయితే చాల సమయం హాకీ శిక్షణ కోసం కేటాయిస్తున్నట్లు సమాచారం.

అయితే ఇతర సినిమా ల షూటింగ్ లో బిజీ గా ఉన్నప్పటికీ లావణ్య త్రిపాఠి హాకీ కౌచింగ్ కి మాత్రం వెళ్లడం మానట్లేదట. అంతేకాకుండా లావణ్య ఎక్కువ సేపు హాకీ కోర్ట్ లో ఉంటున్నట్లు తెలుస్తుంది. వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ లావణ్య త్రిపాఠికి ఇటీవల మంచి హిట్ లేదని చెప్పాలి. అర్జున్ సురవరం చిత్రం తో పర్వాలేదనిపించిన లావణ్య ఈ చిత్రం కోసం శ్రమించడం తో కొందరు ఈ డెడికేషన్ చూసి చిత్ర యూనిట్ అభినందనలు తెలియజేస్తున్నారు.