వీరి కలయికలో రానున్న మూడవ చిత్రం

వీరి కలయికలో రానున్న మూడవ చిత్రం

ప్రస్తుతానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అల వైకుంఠపురంలో విజయానందంలో మునిగి తేలుతున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ తన తరువాత చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో చేస్తున్నాడు కూడా. ఇది వీరి కలయికలో రానున్న మూడవ చిత్రం. కాగా గతంలో వీరి కలయికలో వచ్చిన ఆర్య, ఆర్య 2 ఎంతటి ఘనవిజయాన్ని దక్కించుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వీరి తాజా చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే ఇదివరకే హీరో లేకుండానే ఈ చిత్రానికి సంబందించిన చిత్రీకరణ జరుపుకున్నారు.

ఈ చిత్రంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారని, అందుకు గాను విజయ్ సేతుపతికి భారీ పారితోషకం ఇవ్వనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ చిత్రంలో రంగమత్త కూడా ఒక కీలక పాత్రలో కనిపించనుందట. అయితే రంగస్థలంలో ఒక చక్కటి పాత్రను అనసూయ కోసం సిద్ధం చేసిన సుకుమార్, ఈ చిత్రంలో కూడా మరొక చక్కటి పాత్రని రెడీ చేశారని సమాచారం. కాకపోతే ఈ చిత్రంలో అనసూయ పాత్ర నెగిటివ్ కోణంలో ఉండనుందంట. ఇకపోతే ఈ చిత్రాన్ని మొదటగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేద్దామనుకున్నారు కానీ అదే సమయానికి రాజమౌళి దర్శకత్వంలో వస్తున్నటువంటి RRR రానుండటంతో ఇప్పుడు మరో మంచి విడుదల తేదీ కోసం వెతికే పనిలో పడ్డారంట దర్శకనిర్మాతలు…