కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లియో సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ విడుదలైంది. విజయ్ ఫ్యాన్స్ థియేటర్లలో నానా హంగామా చేస్తున్నారు. అయితే ఈ సినిమా మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. గత కొన్ని రోజులుగా విజయ్‌కు అంతగా కమర్షియల్ సక్సెస్ సినిమాలు లేవు. ఇప్పుుడ ఈ చిత్రం కూడా మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. అయితే మొదటి రోజు కాబట్టి ఇలా ఉందని.. రానురాను మౌత్ టాక్‌తో హిట్ అవుతుందని భావిస్తున్నారు.
ఈ సినిమా ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలిసింది. ఈ సినిమా కోసం సదరు సంస్థ రికార్డ్ స్థాయి మొత్తాన్ని ముట్టజెప్పినట్లు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్‌తో అగ్రీమెంట్ కుదిరిందట. అంటే అక్టోబర్ 19న థియేటర్లలోకి ఈ సినిమా రిలీజ్ అయింది కాబట్టి.. నవంబర్ మూడో వారంలో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది .