లాక్ డౌన్ కారణంగా మనుషుల బదులు జంతుజాతులు రోడ్లపైకి విరివిగా వస్తున్నాయి. దీంతో మనుషులపై అడవి జంతువులు దాడి చేసిన ఘటన తాజాగా చోటుచేసుకుంది. చిరుత పులుల దాడిలో లక్ష్మమ్మకు తీవ్రగాయాలయ్యాయి. ఆమె జుట్టుతో సహా తల పైభాగం ఊడి కింద పడిపోయింది. చిరుత నీళ్ల కోసం మామిడితోటలోకి వచ్చి ఉంటుందని సమాచారం అందుతుంది. అయితే లాక్‌డౌన్ కారణంగా వాహనాల రాకపోకలు స్తంభించిపోవడంతో ఘాట్ రోడ్లు, అటవీ ప్రాంతాల్లో వణ్యప్రాణులు రోడ్లపైకి వస్తున్నాయి. చిరుత పులులు ఈ మధ్య జనావాసాల్లోకి చొరబడిన ఘటనలు చాలా చోటుచేసుకుంటున్నాయి.
కాగా నీటి కోసం మామిడి తోటలోకి ప్రవేశించిన చిరుత.. భార్యాభర్తలపై దాడి చేసిన ఘటన తాజాగా అనతంపురంలో వెలుగుచూసింది. ఈ దాడిలో మహిళకు తలబొప్పి ఊడి కింద పడిపోయి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన జిల్లాలోని పుట్టపర్తిలో జరిగింది. అటవీ ప్రాంతం నుంచి మామిడి తోటలో ప్రవేశించిన చిరుత పులి భార్యాభర్తలపై దాడి చేసిన ఘటన బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లి సమీపంలో జరిగింది.
అయితే చిత్తూరు జిల్లా మదనపల్లె ప్రాంతానికి చెందిన లక్ష్మమ్మ దంపతులు బుచ్చయ్యగారిపల్లి సమీపంలో ఉన్న మామిడితోటను కొనుగోలు చేశారు. తోటలోనే ఉంటూ పనులు చేసుకుంటున్నారు. తెల్లవారుజాముమ అటవీ ప్రాంతంలోని మామిడి తోటలోకి వచ్చిన చిరుత ఒక్కసారిగా దంపతులపై దాడి చేసింది. లక్ష్మమ్మ తలపై చిరుత దాడి చేయడంతో ఆమె తలబొప్పి ఊడి కింద పడింది. జుట్టుతో పాటు తల పైభాగం ఊడి కిందపడి తీవ్రగాయాలయ్యాయి. ఆ తర్వాత భార్యాభర్తలు పెద్దగా కేకలు పెడుతూ అదిలించడంతో చిరుత అక్కడి నుంచి వెళ్లిపోయింది. చిరుత పులి దాడి విషయం తెలుసుకున్న గ్రామస్థులు వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు బాధితురాలిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. చిరుత సంచారంతో రైతులు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు.