బీజేపీయేతర పక్షాలన్నీ ఈ నెల 21న ఢిల్లీలో నిర్వహించనున్న సమావేశం వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీయేతర కూటమిలో రాహుల్ గాంధీ ప్రాధాన్యతను మొదటి నుండీ వ్యతిరేకిస్తున్న బాబుకు షాకిచ్చారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. లోకసభ ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందే ఈ నెల 21వ తేదీన విపక్షాల సమావేశం నిర్వహించాలని చంద్రబాబు, రాహుల్ గాంధీలు భావించారు. కానీ ఈ సమావేశం ఫలితాల తర్వాత నిర్వహిస్తే బాగుంటుందని, ముందుగా అవసరం లేదని మమత అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈవీఎంల విషయంలో అనుమానాలు ఉన్నందున , ఈవీఎంల భద్రతపై దృష్టి సారించాల్సిన సమయంలో ఇలాంటి సమావేశాలు వద్దని చెప్పి ఆమె వాయిదా వేయాలని కోరినట్టు కూడా మరో వాదన వినిపిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు బెంగాల్లో రెండ్రోజుల పాటు మమత పార్టీకి మద్దతుగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 21వ తేదీ సమావేశం గురించి కూడా ఇద్దరూ చర్చించుకున్నట్లు సమాచారం.