మరొకసారి ప్రపంచ చాంపియన్‌గా

మరొకసారి ప్రపంచ చాంపియన్‌గా

లూయిస్ కార్ల్ డేవిడ్సన్ హామిల్టన్ మెర్సిడెస్-ఎఎమ్‌జి పెట్రోనాస్ మోటార్‌ స్పోర్ట్ తరపున ఫార్ములా వన్‌లో రేసులో పాల్గొన్న బ్రిటిష్ రేసింగ్ డ్రైవర్. క్రీడా చరిత్రలో గొప్ప డ్రైవర్లలో ఒకరిగా పరిగణిస్తూ 2008లో మెక్‌ లారెన్‌తో తన మొదటి ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేస్కున్నాడు.

ఉత్తమ డ్రైవర్‌గా పరిగణించబడుతూ మెర్సిడెస్‌ తరపున 2017 నుండి 2019 వరకు హ్యాట్రిక్ టైటిల్స్ గెలుచుకున్నాడు. అంతకుముందు 2014 నుండి 2015 వరకు బ్యాక్-టు-బ్యాక్ టైటిల్స్ గెలుచుకున్నాడు. అత్యంత విజయవంతమైన డ్రైవర్లలో ఒకరైన హామిల్టన్ ప్రస్తుతం ఆల్టైమ్ మోస్ట్ కెరీర్ పాయింట్లు 3399, ఆల్టైమ్ మోస్ట్పోల్ పొజిషన్స్ 7 మరియు ఒకసీజన్‌లో అత్యంత గ్రాండ్స్లామ్‌ల రికార్డులను కలిగి ఉన్నాడు.

లూయిస్ యూఎస్‌ గ్రాండ్‌ ప్రిలో రెండో స్థానంలో నిలిచి వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను సాధించాడు. ఆరో సారి తన ఫార్ములావన్‌ కెరీర్‌లో హామిల్టన్‌ వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచాడు.

ఐదు సార్లు వరల్డ్‌ చాంపియన్‌గా ఫాంగియో నిలవగా తన రికార్డును హామిల్టన్‌ బద్దలు కొట్టాడు. వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌ టైటిల్స్‌ గెలిచిన జాబితాలో జర్మన్‌కు చెందిన మైకేల్‌ స్కూమచర్‌ ఏడు సార్లు వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌ టైటిల్స్‌ గెలిచాడు. హామిల్టన్‌ ఇంకో సారి చాంపియన్‌గా గెలిస్తే స్కూమచర్‌ సాదించిన రికార్డ్ సాదిస్తాడు.