దేశ రాజధానిలో అత్యధిక గాలి కాలుష్యం

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌

దీపావళి తర్వాత ఒకే సారి పెరిగి పోయిన గాలి కాలుష్యంతో దేశ రాజధానిలో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పొంగ మంచు దుప్పటిలా కప్పేసి ప్రమాదకర గాలి వల్ల ప్రపంచంలో కెల్లా అత్యంత కాలుష్య పూరిత నగరంగా ఢిల్లీ నిలిచింది. శ్వాస కోశ, హృదయ సంబంధిత సమస్యలతో హాస్పిటల్స్‌ లో చేరుతున్న వారి సంఖ్య పెరిగింది. ప్రభుత్వం పాఠశాలలకు సెలవులను నవంబరు 5 వరకు ప్రకటించింది ఇంకా విద్యార్థులు కాలుష్యం బారిన పడకుండా అత్యాధునిక ఎన్‌95 మాస్కులను కూడా ప్రభుత్వం పంపిణీ చేసింది.

ఢిల్లీలో కాలుష్యం పెరగడానికి ప్రధాన కారణం పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చి వేయడమే. గాలి నాణ్యత సూచీ ఏక్యూఐ 484కు చేరగా జనవరి 3న అత్యధికంగా 444కు చేరింది.

ఈపీసీఏ ఛైర్మన్ భూరే లాల్ ఢిల్లీ పరిసర రాష్ట్రాలకు లేఖరాస్తూ పంజాబ్‌, హర్యానా, ఉత్తర్‌‌ ప్రదేశ్‌ ప్రాంతాలలో పంట వ్యర్థాలను కాల్చి చేయకుండా విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చర్యలు తీసుకోవాలని చిన్నారులు, వృద్ధులు బయట తిరగడం మంచిది కాదని తెలిపారు. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఆరోపిస్తూ పక్క రాష్ట్రాలలో వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం వల్లే గాలి కాలుష్యం పెరిగినదని తెలిపారు.

ట్విటర్‌ వేదికగా పక్క రాష్ట్రాలపై నిందలు వేస్తున్నారనే విమర్శలకు సమాధానమిస్తూ “ఎవరిపైనా ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదని. చిన్నారుల ఆరోగ్యం పట్ల తగిన చర్యలు తీసుకునేల ప్రభుత్వం చూస్తుందని ఇంకా పక్క రాష్ట్రాల పంట కాల్చివేతల వల్లే కాలుష్యం కి కారణంగా తెలియ చేశారు.

కాలుష్యం బారిన పడిన పంజాబ్‌, హరియాణ సీఎంలు కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చ జరపడానికి రావాలని కోరారు. నిర్మాణ రంగంలో విపరీతంగా కాలుష్యాన్ని కారణం అవుతున్న కంపెనీలపై కూడా జరిమానాలు విధిస్తున్నామని తెలియ చేశారు.