ఢిల్లీ సీఎంపై పోలీస్ ఎటాక్

Police Rides On Delhi CM Kejriwal In AAP MLA'S Attack On CS Case

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఢిల్లీలో రాజకీయం యమారంజుగా సాగుతోంది. ప్రభుత్వ కార్యదర్శి అన్షు ప్రకాష్ పై ఆప్ ఎమ్మెల్యేల దాడి వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి కేజ్రీవాల్ వర్సెస్ బిజేపిగా మారింది. సిఎస్‌పై దాడి వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని త్వరితగతిన కేసుని కొలిక్కి తీసుకురావాలని ఢిల్లీ పోలీసులకి కేంద్రం నుండి ఆదేశాలు అందడంతో పోలీసులు డబుల్ స్పీడ్‌తో ఈ కేసు విచారణ చేస్తున్నారు. 
తనపై ముఖ్యమంత్రి నివాసంలోనే ఆప్‌ శాసనసభ్యులు ఇటీవల దాడికి పాల్పడ్డారన్న అన్షు ప్రకాశ్‌ ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు శుక్రవారం ఏకంగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అధికారిక నివాసానికి వెళ్లారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంటిని పెద్దఎత్తున చుట్టుముట్టి సోదాలు నిర్వహించడం వివాదానికి దారి తీసింది.
సీసీటీవీ దృశ్యాలు సహా ఆధారాల సేకరణ కోసం మాత్రమే పోలీసు బృందాలు వెళ్లాయని ముందస్తు సమాచారంతో వెళ్తే అధారాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని ఆధారాల సేకరణ కూడా కష్టం అయ్యేదని పోలిసుల వాదన. ముందస్తు సమాచారం లేకుండా 60-70 మంది పోలీసులు సీఎం నివాసంలోకి వెళ్ళడం ఏమిటి అని ఇదే ఇంకో రాష్టంలో అయితే చేస్తారా అంటూ అప్ వర్గాలు మండిపడుతున్నాయి. నా నివాసం మొత్తం పోలీసుమయమే అయింది. ఢిల్లీలో ప్రజాస్వామ్యాన్ని పోలీసు రాజ్యం ఖూనీ చేస్తోంది. ఎన్నికైన ముఖ్యమంత్రికే ఇలా జరిగితే ఇక సామాన్యుడి సంగతేమిటో ఆలోచించండి’ అంటూ కేజ్రివాల్ ట్వీట్‌ చేశారు. తన నివాసం లోకి పోలీసుల రాకపై కేజ్రీవాల్‌ మండిపడ్డారు. ‘పోలీసులను పెద్ద గుంపుగా మా ఇంటికి పంపించారు. ఇల్లు  మొత్తాన్ని పోలీసులు గాలించారు. 
పనిలో పనిగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పైన కూడా విమర్శలు సంధించారు కేజ్రివాల్. అది సరే… మరి న్యాయమూర్తి లోయా మృతి కేసులో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాను ఎప్పుడు ప్రశ్నిస్తారు?’ అని ట్విటర్లో ప్రశ్నించారు. ‘ప్రజాస్వామ్యంలో కొన్ని కనీస సంప్రదాయాలు పాటించాలి. ప్రతీ పౌరునికీ రాజ్యాంగం ప్రకారం కొన్ని హక్కులు ఉంటాయి. పేదల కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రిని చిన్నబుచ్చడానికి జరిగిన ప్రయత్నమేనా ఇది?’ అని ప్రశ్నించారు. కేంద్రం అండ చూసుకుని ఢిల్లీ పోలీసులు రంకెలు వేస్తూ, దాదాగిరి చేస్తున్నారని ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అంటూ ఆప్‌ నేత అశుతోష్‌ అన్నారు.
మరో వైపు ఇదే విషయంలో ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేస్తున్న ఐఏఎస్‌లపై, ముందస్తు అనుమతి లేకుండా ముఖ్యమంత్రి నివాసం పై దాడి చేసిన  డిల్లీ పోలీసులపై డిల్లీ  లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ను కలిసి పిర్యాదు చేశారు అప్ మంత్రులు మరియు ఎమ్మెల్యేలు. అధికారులతో తను మాట్లాడతానని వారు ప్రభుత్వానికి సహకరించేలా ప్రయత్నం చేస్తాను అని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మాటిచ్చారు అని మీడియాకు వివరించారు అప్ నేతలు