బంగాళాఖాతం ఉత్తర ప్రాంతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. గ్యాంగ్టక్ పశ్చిమ బెంగాల్‌కు సమీపంలో తీవ్ర అల్పపీడనం కదులుతోందన్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టనికి 7.6కి.మీ ఎత్తున విస్తరించింది .
దీంతో రాబోయే 48 గంటల్లో పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్ వైపు కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రాగల 48 గంటలు పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే ఒకటి రెండు చోట్లా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.