లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే

ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో ఏడుగురు నిందితులకు ఏసీబీ కోర్టు (ACB Court) రిమాండ్ పొడిగించింది. ఈకేసులో నిందితులకు నేటితో రిమాండ్ ముగిసింది. దీంతో ఈరోజు ఉదయం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య,పైలా దిలీప్, బాలాజీ గోవిందప్ప, కృష్ణ మోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలను ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరుపర్చారు. వీరికి ఏసీబీ కోర్టు జూన్ 3 వరకు రిమాండ్ విధించింది. ఇక కేసులో దర్యాప్తు పురోగతి తెలియజేయటం లేదని నిందితుల న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై రేపు (బుధవారం) విచారణ జరిగే అవకాశం ఉంది.