ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు-ఈసీబీ ఇంగ్లండ్ మహిళల జట్టుకు హెడ్ కోచ్గా మాజీ క్రికెటర్ లీసా కెయిట్లీ తొలిసారి మహిళా క్రికెటర్ని నియమించబోనున్నట్టు తెలిపింది. మాజీ క్రికెటర్ లీసా కెయిట్లీ ఆ్రస్టేలియాకి చెందిన మహిళా క్రీడాకారిణి.
మాజీ ఆస్ట్రేలియా క్రికెట్ క్రీడాకారిణి అయిన ఆమె కుడిచేతివాటం బ్యాట్స్మాన్ ఇంకా రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్. ఆస్ట్రేలియా జాతీయ మహిళా క్రికెట్ జట్టుకోసం ఆమె తొమ్మిది టెస్టులు మరియు 85 వన్డే ఇంటర్నేషనల్స్ 1995-2005 మధ్య ఆడింది. మహిళల వన్డే చరిత్రలో అత్యధిక తొలి టన్నుగా రికార్డు సృష్టించింది.
దేశీయ జాతీయ క్రికెట్ లీగ్లో 91మ్యాచ్లలో 3సెంచరీలు, 21 అర్ధసెంచరీలు, 3081పరుగులు చేసింది. ఆమె గతంలో ఆస్ట్రేలియా మహిళలకు శిక్షణ ఇచ్చింది.ఇంగ్లాండ్ ఉమెన్స్ అకాడమీ మాజీ ప్రధాన కోచ్గా కూడా బాద్యతలు నిర్వహించారు.
ఇప్పటి వరకు మార్క్ రాబిన్సన్ ఇంగ్లండ్ మహిళల జట్టుకు కోచ్గా వ్యవహరించారు. అయితే యాషెస్ సిరీస్లో ఓటమి తర్వాత మార్క్ రాబిన్సన్ పదవికి రాజీనామా చేయగా వచ్చే జనవరిలో లీసా తన బాధ్యతలు స్వీకరిస్తుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ మహిళల వన్డే జట్టు వరల్డ్ చాంపియన్గా ఉండి టి20 ప్రపంచకప్లో ఫైనల్కు చేరింది. ప్రస్తుతం లీసా బిగ్ బాష్ టి20 లీగ్లో పెర్త్ స్కార్చర్స్ జట్టుకు కోచ్గా వ్యవహరిస్తోంది