సీఎం కేసీఆర్ పై ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్ పై ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా చర్చించుకుంటున్న ఒకే ఒక్క సమస్య ఆర్టీసీ. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా, కార్మికుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్ కారణం అవుతున్నారని ప్రతి పక్షాలు విమర్శలు చేస్తున్నాయి.కేసీఆర్ తీరుని ఎండగట్టేందుకు ఆర్టీసీ జేఏసీ సకల జనుల సమర భేరిని సరూర్ నగర్ లో నిర్వహించింది.ప్రతి పక్షాలు, ప్రజలు ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలిపాయి. ఆ కార్యక్రమంలో కేసీఆర్ ఫై ప్రతి పక్షాలు విమర్శలు గుప్పించారు.

తాజాగా సీఎం కేసీఆర్ పై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి పలు విషయాలను వెల్లడించారు.తెలంగాణ రాష్ట్ర సాధనకై సాగించిన ఉద్యమ పోరాటం లో ఆర్టీసీ కార్మికుల పాత్రని తెలిపారు.ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు కారణం కేసీఆర్ అని, అవి కేసీఆర్ చేసిన హత్యలే అని అన్నారు. కేసీఆర్ పై చాల మండిపడ్డారు.కేసీఆర్ ఒక రాక్షసుడు, మానవత్వం లేని ఒక మృగం అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.కేసీఆర్ ని మాత్రమే కాకుండా మంత్రుల పై కూడా విరుచుకుపడ్డాడు.తెలంగాణ రాష్ట్రంలో వున్న మంత్రులు బ్రోకర్లు, జోకర్లు అని సంచలన వ్యాఖ్యలు చేసారు బండి సంజయ్.