ఏపీలో మళ్లీ వాయిదా పడ్డ స్థానిక ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థ‌ల‌ ఎన్నికలు మరికొంత కాలం వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ నోటిఫికేషన్ జారీచేసింది. కరోనా కంట్రోల్ లోకి రాక‌పోవ‌డ‌వంతో వాయిదాను కొనసాగించాలని నిర్ణయించింది. లాక్‌డౌన్ కొనసాగింపు, హైకోర్టు ఆదేశాలతో ఎన్నికలు నిలిపివేత కొనసాగిస్తున్నామని తెలిపిన ఎస్‌ఈసీ.. పరిస్థితులు అదుపులోకి వ‌చ్చిన తర్వాతనే స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

అదేవిధంగా కోవిడ్-19 కార‌ణంగా లోక‌ల్ బాడీ ఎల‌క్ష‌న్స్ ను తొలుత ఆరు వారాల పాటు వాయిదా వేసింది ఎస్ఈసీ. అలాగే.. మార్చి 15 నుంచి ఆరు వారాల పాటు ఎన్నికలను పోస్ట్ పోన్ చేసింది. గడువు ముగియడంతో ఎన్నికల నిర్వహణపై రివ్యూ చేసిన‌ ఎస్ఈసీ కనగరాజ్… తర్వాత ఆర్డ‌ర్స్ వ‌చ్చేవ‌ర‌కు ఎన్నికలు ప్రక్రియ నిలిపివేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి స్టేట్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ నోటిఫికేషన్ జారీచేసింది.