లాక్ డౌన్ ఎఫెక్ట్.. ఆయా కంపెనీల రూల్స్ ఇవే..

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించేస్తుంది. ఆర్థిక వ్యవసస్థను చిన్నాభిన్నం చేసింది. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు స్తంభించాయి. ఈ మహమ్మారి కారణంగా కంపెనీలు తమ హెచ్ఆర్ పద్ధతులను రీవ్యాల్యుయేట్ చేస్తూ కరోనా సవాళ్లను అధిగమించేందుకు రెడీ అవుతున్నాయి. అయితే 50 శాతం కంపెనీలు తమ వేతన బడ్జెట్ లో మార్పు లేదని వెల్లడించాయి. 36 శాతం కంపెనీలు వేతన బడ్జెట్‌ను తగ్గించుకుంటున్నాయి. తాజాగా ఓ సంస్థ జరిపిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.

కరోనా వైరస్ తో మానవవనరుల విధానాలను సమీక్షించుకుంటున్నామని తాజా సర్వేలో వెల్లడైంది. కేపీఎంజీ సంస్థ కరోనా హెచ్ఆర్ ప్రాక్టీసెస్ సర్వే రిపోర్ట్ పేరుతో నివేదికను తయారు చేసింది. ఉద్యోగుల జీతభత్యాలు, కొత్త నియామకాలు, ఉద్యోగులకు సంబంధించి పలు అంశాలపై పరిశీలించి విశ్లేషించింది ఈ సర్వే. 50 శాతం కంపెనీలు ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియను వాయిదా వేయడమో లేకా రద్దు చేయడడమే ఆలోచనలో ఉన్నాయి. ఐటీ సెక్టార్, ఐటీఈఎస్, లైఫ్ సైన్సెస్, ఫార్మా, రిటైల్ రంగాల్లోని సంస్థలు యథాతథ స్థితిని కొనసాగిస్తున్నాయి.

అదేవిధంగా పలు కంపెనీల్లో ఆయా ఉద్యోగస్థాయిలలో ప్రమోషన్ల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇందులో 33 శాతం సంస్థలు ప్రమోషన్ల సంఖ్యను తగ్గించినట్లు తెలిపాయి. కరోనా పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ కంపెనీల ఆర్థిక పరిస్థితికి మద్దతుగా కంపెనీలు మరిన్ని ప్రోత్సాహక చెల్లింపులు వాయిదా వేయడమో లేకా స్తంభింప చేయడమో చేస్తాయని తెలిపింది. కాగా ఈ మహమ్మారిని అధిగమించేందుకు కంపెనీలు సంసిద్ధమవుతున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది.

అంతేకాకుండా పలు కంపెనీలు ల్యాప్‌టాప్ ఇస్తూ.. ఐటీ/ ఐటీఈఎస్, కన్సల్టెన్సీ సేవల విభాగాలకు చెందిన 68 శాతం సంస్థలు తమ సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేందుకు రెడీ కాబోతున్నాయి. 48 శాతం సంస్థలు తమ సిబ్బందికి ఇంటి నుండి పని చేసేందుకు సెక్యూర్డ్ కనెక్షన్ ల్యాప్‌టాప్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. పీఎస్‌యూలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిటైల్ విభాగాల్లోని కొన్ని కంపెనీలు తమ సిబ్బందిని సొంత ల్యాప్‌ట్యాప్‌తో ఇంటి నుండి పని చేసేందుకు అనుమతించాయి. కాగా కరోనా కారణంగా చాలా సంస్థలు ఇప్పుడు మరింత లిక్విడిటీ, సౌకర్యవంతమైన మార్గంలోకి వెళ్తున్నాయి.

వ్యాపారాల కొనసాగింపు, శ్రామిక శక్తి నిర్వహణపై కొత్త వ్యూహాలు, కొత్త ఆపరేటింగ్ మోడల్స్ అవసరమని చెప్తున్నాయి. కరోనా కారణంగా కంపెనీలు కొత్త నియామకాలను 66 శాతం మేరకు నిలిపివేశాయి. 30 సంస్థలు తమ సిబ్బంది బడ్జెట్ తగ్గిస్తున్నాయి. సిబ్బందికి ఈ-వెబినార్స్, ఈ-లెర్నింగ్ పద్ధతిలో శిక్షణ నిర్వహించాలని కంపెనీలు భావిస్తున్నాయి. దాదాపు 20 ప్రధాన వ్యాపార రంగాలకు చెందిన 315 సంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నట్లు తెలిపింది.