మద్యం మత్తు ప్రాణం తీసింది

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో మద్యం మత్తు ఏ ప్రాణాన్ని బలికొంది. తాగిన మత్తులో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరు మరణించేందుకు దారితీసింది. అయితే ఈ ఘర్షణ లో ఒకరు మృతి చెందగా మరొకరు ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్నాడు.

ఒడిశా కు చెందిన వీరు ఒక హోటల్ లో పని చేస్తున్నారు. గత రాత్రి వీరి మధ్య స్వల్పంగా గొడవ చేసుకుంది. అందులో ఒకరికి గొంతుపైన.. మరొకరికి తలపైన తీవ్రమైన గాయాలై రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు చావుతో పోరాటం చేస్తున్నాడు. అయితే వీరిమధ్య సొంతూళ్లకే వెళ్లే విషయంలో అభిప్రాయభేదాలు వచ్చాయని అందులో… నిన్న మద్యం కొనుగోలు చేసి తాగిన మైకంలో వీరిద్దరూ గొడవ పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.