చంద్రబాబు అరెస్ట్ పై జాతీయ మీడియాతో మాట్లాడనున్న లోకేష్..

Lokesh to talk to national media on Chandrababu's arrest..
Lokesh to talk to national media on Chandrababu's arrest..

రాజమండ్రి నుంచి ఢిల్లీ బయలుదేరారు నారా లోకేష్. నిన్న రాత్రి నారా లోకేష్ ఢిల్లీకి చేరుకున్నారు . ఇక ఇవాళ చంద్రబాబు అరెస్ట్ పై నారా లోకేష్ జాతీయ మీడియాతో మాట్లాడనున్నారు . ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో పరిస్థితులను లోకేష్ జాతీయ స్థాయిలో వివరించేందుకు ఢిల్లీ టూర్ వెళ్లారు.

అంతేకాకుండా చంద్రబాబుపై కేసు విషయంలో సుప్రీంకోర్టు న్యాయవాదులతో నారా లోకేష్ చర్చించనున్నారు. అటు పార్లమెంటులో సైతం కక్ష రాజకీయాలు, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పరిస్థితులను చర్చించేలా టీడీపీ వ్యూహం రచిస్తోంది. చంద్రబాబు అరెస్టుపై లోక్ సభలో చర్చ కోసం పార్టీ ఎంపీలతో నారా లోకేష్ మాట్లాడనున్నారు .

కాగా, ప్రస్తుత పరిస్థితులు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో వాడి వేడిగా ఉన్నాయి. టిడిపి నాయకత్వాన్ని ఎవరు భుజాన వేసుకుంటారో, నిరాశలో ఉన్న శ్రేణులలో ఉత్సాహం ఎవరు నింపుతారో అని ప్రతి టిడిపి కార్యకర్త ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.చంద్రబాబు నాయుడు తర్వాత ఆ స్థానాన్ని లోకేష్ భర్తీ చేస్తారా లేదా లోకేష్ ని కూడా అరెస్టు చేస్తారా అనే ప్రశ్న అందరిలోనూ ఉంది.