‘లార్డ్ ఆఫ్ రింగ్స్’ నటుడు ఇయాన్ హోల్మ్ ఇకలేరు

‘లార్డ్ ఆఫ్ రింగ్స్’ సినిమా ఓ అద్భుతం.. ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆస్కార్ నామినేటెడ్ బ్రిటన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, సూపర్ హిట్ అయిన ‘లార్డ్ ఆఫ్ రింగ్స్’, ‘ ఏలియన్’ సినిమాల నటుడు ఇయాన్ హోల్మ్ కన్నుమూశారు. అయితే ఆయన వయసు 88 సంవత్సరాలు.1981లో వచ్చిన చారియట్స్ ఆఫ్ ఫైర్ సినిమాకి గాను ఆయన ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన విషయం తెలిసిందే.

అయితే ఇదే సినిమాకి గాను ఆయన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ సహాయ నటుడి అవార్డును అందుకున్నారు. ‘ది మ్యాడ్ నెస్ ఆఫ్ కింగ్ జార్జ్’, ‘ది ఏవియేటర్’, ‘ది డే ఆఫ్టర్ టుమారో’, ‘ది ఫిఫ్త్ ఎలిమెంట్’ వంటి గొప్ప సినిమాల్లో తన నటనా ప్రతిభను ప్రదర్శించి ఎందరో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు ఇయాన్. కాగా ఆయన చివరిగా 2014లో వచ్చిన ‘ది హాబిట్: ది బ్యాటిల్ ఆఫ్ ది ఫైవ్ ఆర్మీస్’ సినిమాలో కనిపించారు. అయితే కొంతకాలంగా పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతూ ఉన్న ఆయన కాసేపటి క్రితం కన్నుమూశారని ఆయన ప్రతినిధి తెలిపారు. ఆసుపత్రిలో కుటుంబికులందరి మధ్యా ప్రశాంతంగా ఆయన తుది శ్వాస విడిచారని స్పష్టం చేశారు. కాగా ఇయాన్ మరణం హాలీవుడ్ కు తీరని లోటని పలువురు నటీ నటులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.