తెలంగాణలో ఓ యువకుడు ఉన్మాదిలా ప్రవర్తించాడు. వరంగల్లో ప్రేమికుడు ఉన్మాదిలా మారి ఇంటర్మీడియెట్ చదువుతోన్న బాలికను బీరు సీసాతో పొడిచేశాడు. ఓ యువకుడు వరంగల్ నగరంలో ఓ అమ్మాయిని ప్రేమించాడు. తనను దూరం పెట్టిందన్న అక్కసుతో ప్రియురాలిపై ఏకంగా బీరు సీసాతో దాడి చేశాడు. వరంగల్ లేబర్కాలనీకి చెందిన యువతి ఈ మధ్య ఇంటర్ ఫస్టియర్ పూర్తి చేసింది. అదే ప్రాంతానికి చెందిన నిఖిల్ అనే యువకుడితో కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడిపిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ఆమెను బయటకు రానీకుండా కట్టడి చేశారు. అంతేకాకుండా సెల్ఫోన్ కూడా అందుబాటులో ఉంచడం లేదు. దీంతో ప్రియుడి పిచ్చి పరాకాష్టకు చేరింది. ప్రియురాలితో ఒక్కసారి కూడా మాట్లాడలేకపోతున్నానే అని ప్రియుడి రెచ్చిపోయాడు.