సాయి పల్లవి, నాగచైతన్యల ‘లవ్‌స్టోరి’మూవీ రికార్డ్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. కరోనా సెంకడ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద సినిమా ఇదే. థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో రారో అని బడా సినిమా నిర్మాతల అనుమానాల్ని పటాపంచలు చేస్తూ తొలి రోజే రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టి ‘వావ్’ అనిపించింది.
ఫిల్మ్ దునియాలో వినిపిస్తున్న సమాచారం మేరకు తొలిరోజు లవ్‌స్టోరీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 10 కోట్లను వసూళ్లు చేసిందట. ఒక యూఎస్‌లోనే 2.9 కోట్ల కలెక్షన్లను రాబట్టి, సెంకడ్ వేవ్ తర్వాత ఇంత భారీ ఓపెనింగ్ కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా లవ్‌స్టోరి నిలిచింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సినిమాకు అటుఇటుగా రూ.6 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల మాట. ఒక్క నైజాం నుంచే 3 కోట్ల రూపాయలకు పైగా షేర్ వచ్చిందట. సీడెడ్ నుంచి కోటికి పైగా షేర్ వచ్చింది.
వెస్ట్, గుంటూరు ఏరియాల్లో, ఒక్కో సెగ్మెంట్ నుంచి అరకోటికి పైగా షేర్లు వచ్చినట్లు తెలుస్తోంది.లవ్‌స్టోరి మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 32.8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్ర హక్కులు 16.8 కోట్ల రూపాయలకు సేల్ అయ్యాయని టాక్. నైజాం ఏరియాలో 11 కోట్ల రూపాయల బిజినెస్ చేసిందని అంటున్నారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.36 కోట్ల దాకా లాభాలను రాబట్టాల్సి ఉంటుంది. మరి ఆ టార్గెట్‌ను ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తుందో చూడాలి.