Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రేమవివాహంలో అంతులేని విషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట తీవ్ర గాయాల పాలవ్వగా… వారికి సాయంచేసిన మరొక వ్యక్తి మృత్యువాతపడ్డాడు. వివరాల్లోకెళ్తే… ఖమ్మం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన తరుణ్, సుమ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వారి ప్రేమను పెద్దలు ఆమోదించలేదు. దీంతో వారు భద్రాచలంలో పెద్దలకు తెలియకుండా పెళ్లిచేసుకున్నారు. అక్కడినుంచి తిరిగివస్తుండగా విషయం తెలిసిన అమ్మాయి తరపు బంధువులు సినీ ఫక్కీలో వాహనాల్లో వెంబడించారు. వారి నుంచి ప్రేమజంటను తప్పించుకునేందుకు కారు నడుపుతున్న యువకుడు వేగం పెంచాడు. ఈ క్రమంలో గోపాలపురం వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కల్వర్ట్ ను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా… కారులో ప్రయాణిస్తున్న ప్రేమజంటతో పాటు మరో వ్యక్తి గాయపడ్డాడు. వారిని ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తరుణ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.