ప్రేక్షకులను నీరు గార్చిన బిగ్‌బాస్‌

Machiraju Pradeep Is Not Wild Card Entry Just A Guest in bigg boss house

బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో పెద్ద సెలబ్రెటీలు లేరు అనే విమర్శలు మొదటి నుండి వస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా ఇంట్లోకి ప్రదీప్‌ను వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా వెళ్లబోతున్నట్లుగా నిన్నంత ప్రచారం జరిగింది. బిగ్‌బాస్‌ ఇంట్లోకి ప్రదీప్‌ వెళ్లినట్లుగా చూపించడంతో అది కూడా బ్రీప్‌కేస్‌తో వెళ్లినట్లుగా చూపించడంతో అంతా కూడా అవాక్కయ్యారు. షో టీఆర్పీ రేటింగ్‌ రెట్టింపు అవ్వడం ఖాయం అని అంతా భావించారు. కాని అనూహ్యంగా షోలో ప్రదీప్‌ గెస్ట్‌గా మాత్రమే వెళ్లాడు అని తేలిపోయింది. ప్రేక్షకులతో పాటు ఇంటి సభ్యులను కూడా ప్రదీప్‌ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా వచ్చాడు అని నమ్మించేందుకు ప్రయత్నం చేశారు. అయితే అమిత్‌ ప్రదీప్‌ తీసుకు వచ్చిన బ్రీఫ్‌కేస్‌లో ఉన్న డ్రస్‌లను పరిశీలించి చూసి అవి ప్రదీప్‌వి కావని నిర్ణయానికి వచ్చాడు.

ప్రదీప్‌ వేసుకునే డ్రస్‌లు బ్రాండెడ్‌, కాని బ్రీఫ్‌కేసులో ఉన్నవి మాత్రం సాదారణమైనవి అని, అలా ప్రదీప్‌ ఇంట్లోకి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా రాలేదు అని తేలిపోయింది. బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులు తెరకెక్కించిన చిత్రం లపంగిరిగిట్ట చిత్రం ప్రీమియర్‌ షోకు వచ్చాడని తేలిపోయింది. బిగ్‌బాస్‌ ఇంట్లోని యాక్టివిటీ ఏరియాను ప్రీమియర్‌ షోకు రెడీ చేసి, ప్రదీప్‌కు ప్రత్యేకమైన సీట్‌ను ఏర్పాటు చేసి షో వేయడం జరిగింది. మూవీ ప్రీమియర్‌తో పాటు, ప్రదీప్‌ త్వరలో చేయబోతున్న రియాల్టీ షో ‘పెళ్లి చూపులు’ను కూడా బిగ్‌బాస్‌ ద్వారా ప్రకటించడం జరిగింది. ఈ పెళ్లి చూపులు షో ద్వారా ఒక అమ్మాయిని ఎంపిక చేసి, తాను పెళ్లి చేసుకుంటాను అంటూ ప్రదీప్‌ ప్రకటించాడు. బిగ్‌బాస్‌ పూర్తి అయిన తర్వాత పెళ్లి చూపులు షో ప్రారంభం కాబోతుంది. ఆడిషన్స్‌ ప్రారంభం అయినట్లుగా ప్రకటించారు.