టాప్‌ డైరెక్టర్‌కు రూ.10 జరిమానా!

Madars High Court Fined in Director Shankar

కోలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ శంకర్‌కు చెన్నై హైకోర్టు 10 వేల రూపాయల జరిమానా విధించింది. కోర్టుకు హాజరు కాని కారణంగా శంకర్‌కు ఈ జరిమానా విధించినట్లుగా తెలుస్తోంది. జరిమానాను బ్లూ క్రాస్‌ సొసైటీ వారికి శంకర్‌ చెల్లించాల్సి ఉందని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దర్శకుడు శంకర్‌కు జరిమానా పెద్ద విషయం కాదు కాని, ఈ విషయమై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దర్శకుడు శంకర్‌ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘రోబో’ కథ వివాదంలో శంకర్‌కు కోర్టు జరిమానా విధించినట్లుగా తెలుస్తోంది.

Director Shankar

రజినీకాంత్‌, ఐశ్వర్యారాయ్‌ జంటగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రోబో’ చిత్రం కథ తనది అంటూ అరూర్‌ నందన్‌ అనే వ్యక్తి గత కొంత కాలంగా చెన్నై హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నాడు. పిటీషన్‌ వేసిన ఆరూర్‌ నందన్‌ కేసును విచారిస్తున్న హైకోర్టు గతంలో పలు సార్లు శంకర్‌ను కోర్టుకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాని శంకర్‌ మాత్రం బిజీగా ఉన్నాను అంటూ పలు సార్లు కోర్టుకు హాజరు కాలేదు. దాంతో కోర్టు ఆగ్రహంతో జరిమానా విధించింది. ఈనెల 12న మరోసారి ఈ కేసును వాయిదా వేయడం జరిగింది. ఆ రోజు అయినా కోర్టుకు శంకర్‌ హాజరు అయ్యేలా చూడాలని ఆయన తరపు న్యాయవాదికి కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కోర్టు ఆదేశాలను గౌరవించి ఈసారి అయినా శంకర్‌ కోర్టులో హారు అవుతాడా మరోసారి జరిమానా కట్టేందుకు కూడా ఓకే చెప్పి హాజరు కాకుండా ఉంటాడో చూడాలి.