ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో సమంత చేసిన ఐటెం సాంగ్‌కు ఎంతగా రెస్పాన్స్ వస్తుందో అంతే రేంజ్‌లో వివాదాలు అలుముకుంటున్నాయి. ఊ ఉంటావా మామ.. ఊఊ అంటావా అంటు సాగే ఈ పాట ఓ వైపు వ్యూస్ పరంగా దూసుకుపోతూ యూట్యూబ్‌లో రికార్డు సృష్టిస్తోంది. మరో వైపు మగవారి మనోభవాలను దెబ్బతీశారంటూ ఈ పాటపై ఏపీ పురుషుల సంఘం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
మగవాళ్లంతా చెడ్డవారు అనే అర్థం వచ్చేలా ఈ సాంగ్ ఉందని, వెంటనే దీనిని తొలగించాలంటూ డిమాండ్ చేశారు. అంతేగాక పుష్ప టీంతో పాటు సమంతపై కూడా కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో సమంత స్పెషల్ సాంగ్‌పై పురుషుల సంఘం పెట్టిన కేసుపై మాధవిలత స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఫేస్‌బుక్ వేదికగా ఆమె ఓ పోస్ట్ షేర్ చేస్తూ మహిళల పరువు పోయిందంటూ అసహనం వ్యక్తం చేసింది. ‘వాయమ్మో పుష్ప మూవీ సాంగ్ మీద కేసు అంటగా. ఈ లెక్కన ఇండస్ట్రీలో 98 శాతం పాటలు అలానే ఉంటాయి. సాంగ్స్ లేని మూవీ చెయ్యాలి.
నేను కూడా అమ్మాయిల మీద రాసే పాటలకి కేసులు పెడతా. పుష్పలో రారా సామీ సాంగ్ మీద కేసు వేస్తా. ఏంటీ ఒక అమ్మాయికి మగాడిని చూస్తే.. అతను పిలిస్తే అంత చులకనగా వెంటపడి వెళ్లిపోద్దా? అబ్బాయి నడిచినచోట భూమిని మొక్కుతుందా? ఒక మహిళ పరువు పోయింది. ఛ నాకు నచ్చలే. నేనూ కేసు పెడతా. అంతే తగ్గేదేలే’ అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో సమంత స్పెషల్ సాంగ్‌ను వివాదాలు చుట్టుముట్టిన నేపథ్యంలో మాధవిలత పెట్టిన ఈ పోస్ట్ హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై పలువురు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.