Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Madhu Yashki threatens kcr government
ఉద్యమ పార్టీ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్ఎస్ తెలంగాణకు చేసిందేమీ లేదని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. సబ్బండ వర్ణాల సాధికారత గాలికొదిలేసి, తమ కుటుంబాన్ని మాత్రం బాగుచేసుకున్నారని కేసీఆర్ పై విరుచుకుపడ్డారు మాజీ ఎంపీ మధు యాష్కీ. లేచిన దగ్గర్నుంచి ఇతరుల్ని తప్పుబట్టడం మినహా.. మన తప్పులేంటో తెలుసుకోవాలనే తాపత్రయం కేసీఆర్ కు లేదని కుండబద్దలు కొట్టారు.
తెలంగాణ జనాల్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని, రంగాల వారీగా కేసీఆర్ ఫ్యామిలీ పంచుకుని మరి కమీషన్లు వెనకేస్తున్నారని మండిపడ్డారు యాష్కీ. ఉద్యమం సమయంలో వసూళ్లు చేసినా.. జనం పట్టించుకోలేదని, కానీ ప్రభుత్వంలో ఉండి కమిషన్లు తీసుకోవడమేంటని నిలదీశారు యాష్కీ. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును తెలంగాణ రాబందుల సమితిగా మార్చుకోవాలని సూచించారు.
తెలంగాణ బిల్లు పాస్ కావడానికి కీలకంగా పనిచేసిన మీరాకుమార్ విషయంలో కేసీఆర్ వైఖరి తీవ్ర అభ్యంతరకరమని, కనీసం ఫోన్ కు రిప్లై ఇచ్చే సంస్కారం కూడా ఆయనకు లేదని మండిపడ్డారు. కేసీఆర్ ఒంటెద్దు పోకడలు పోతే.. వచ్చే ఎన్నికల్లో భంగపాటు తప్పదని, ఎంత త్వరగా ప్రజాభిమానం సంపాదించారో.. అంతే త్వరగా పడిపోతారని జోస్యం చెప్పారు యాష్కీ.