మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే నిన్న జరిగిన ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద శివ బాలాజీ చేతిని సినీ నటి హేమ కొరకడం చర్చకు దారి తీసింది. పోలింగ్ కేంద్రం వద్ద తాను వెళ్తున్న సమయంలో శివబాలాజీచేయి అడ్డుగా పెట్టాడని, తప్పుకోమంటే తప్పుకోలేదని, అందుకే చేయి కొరకాల్సి వచ్చిందని హేమ క్లారిటీ ఇచ్చింది.
తాజాగా ఈ ఘటనపై శివబాలాజీ భార్య మధుమిత స్పందించింది.ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి పనులు మనుషులు మాత్రం చేయరు. ఇంతకన్నా ఇంకేమీ చెప్పలేను అని ఘాటుగా బదుల్చిచ్చింది. ఇక తన భర్త శివబాలాజీ గెలవడంపై హర్షం వ్యక్తం చేసింది. నిస్వార్థంగా సేవ చేసినప్పుడు దానికి ప్రతిఫలం దక్కుతుందని తాను నమ్ముతానని బదులిచ్చింది.