‘మహానటి’ తప్ప మరే ఛాన్స్‌ లేదు

Mahanati Movie Only has Chance to Collect Record Collections In Summer

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఈ సంవత్సరంలో మొదటి హిట్‌గా ‘రంగస్థలం’ నిలిచిన విషయం తెల్సిందే. సమ్మర్‌ హాలీడేస్‌ను బాగా ఉపయోగించుకున్న రంగస్థలం 200 కోట్లను వసూళ్లు చేసింది. ఆ తర్వాత వచ్చిన ‘భరత్‌ అనే నేను’ చిత్రం కూడా సమ్మర్‌ స్పెషల్‌గా భారీ వసూళ్లను రాబట్టింది. సునాయాసంగా 150 కోట్ల మార్క్‌ను క్రాస్‌ చేసింది. మరో వారం రోజుల పాటు ఈ సినిమా జోరు కొనసాగే అవకాశం ఉంది. ఇటీవలే విడుదలైన నా పేరు సూర్య చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. దాంతో మిగిలిన ఈ సమ్మర్‌ హాలీడేస్‌ను వినియోగించుకునే అవకాశం మహానటికి దక్కిందని సినీ వర్గాల వారు మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

భారీ స్థాయిలో అంచనాలున్న ‘మహానటి’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అయ్యింది. దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ సినిమా గురించిన వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఈ చిత్రం విడుదల కాబోతుంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా ప్రతి తెలుగు ప్రేక్షకుడు కూడా ఈ చిత్రాన్ని చూడాలనే ఆసక్తిని కనబర్చుతున్నారు. అసు సావిత్రి జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటీ, ఆమె ఎందుకు చివరకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. సావిత్రి ఎలా చనిపోయిందనే విషయాలను తెలుసుకునేందుకు అంతా ఆసక్తిగా ఉన్నారు. సమ్మర్‌ హాలీడేస్‌లో పెద్ద సినిమాలు అనుకున్నవి అన్ని కూడా విడుదల అయ్యాయి. ఇక మిగిలి ఉన్న ‘మహానటి’ తప్ప ప్రేక్షకులకు మరో ఛాన్స్‌ లేదు. కనుక సినిమా ఎలా ఉన్నా కూడా తప్పకుండా మంచి వసూళ్లను రాబడుతుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.