మహానాయకుడు ఫస్ట్ డే కలెక్షన్స్ !

Mahanayakudu To Get Postponed

మొదటి నుండే అనుకున్నదే అయ్యింది. బాలయ్య గత మూవీస్ తో పోల్చితే ప్రేస్టేజియస్ ప్రాజెక్ట్ అయిన ఎన్టీఆర్ బయోపిక్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర తనదైన మార్క్ వేస్తాడని అనుకున్నా ఎన్టీఆర్ బయోపిక్ మొదటి పార్ట్ టాక్ బాగున్నా అంచనాలు అందుకో లేక బయ్యర్లకు నష్టాలూ కలిగించే కలెక్షన్స్ తో డిసాస్టర్ గా మిగిలి పోయింది. ఇక ఇప్పుడు ఆ నష్టాలను భర్తీ చేయడానికి వచ్చిన మహానాయకుడు కూడా క‌లెక్ష‌న్లు భయపెట్టేలా వస్తున్నాయి. క‌థానాయ‌కుడుతో పోల్చినా కూడా దారుణంగా పడిపోయాయి క‌లెక్ష‌న్లు.

ఆ సినిమాతో పోలిస్తే ఇది క‌నీసం స‌గం కూడా తీసుకురాలేదు. ఓవ‌ర్సీస్ క‌లెక్ష‌న్లు అయితే ఇంకా దారుణంగా ఉన్నాయి. అక్క‌డ క‌థానాయ‌కుడు ప్రీమియ‌ర్స్ రూపంలో అక్క‌డ ఏకంగా 4.85 ల‌క్ష‌ల డాల‌ర్లు వ‌స్తే ఇప్పుడు మ‌హానాయ‌కుడు మాత్రం కేవ‌లం 75 వేల డాల‌ర్ల‌తో స‌రిపెట్టుకుంది. దాన్ని బ‌ట్టే సినిమా ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. క‌థానాయ‌కుడు సినిమాకు క‌నీసం 50 శాతం ఆక్యుపెన్సీ వ‌చ్చింది. కానీ ఇప్పుడు మ‌హానాయ‌కుడు మాత్రం సినిమా మొదటి రెండు షోల కి 18% నుండి 20% వరకు ఆక్యుపెన్సీ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించగా ఈవినింగ్ అండ్ నైట్ షోల సమయానికి ఫైనల్ గా గ్రోత్ 30% కి పైగానే ఉంటుందనుకున్నా అలా జరగలేదు. సినిమా మొత్తంగా 25% లోపే ఆన్ లైన్ బుకింగ్స్ ని అందుకుంది, ఆఫ్ లైన్ వివరాలు క్లియర్ గా తెలియరాలేదు. అలా చూసుకుంటే తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో క‌నీసం 4 కోట్లు కూడా తీసుకురావ‌డం క‌ష్ట‌మేనని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. క‌థానాయ‌కుడు సినిమా 50 కోట్ల వ‌ర‌కు న‌ష్టాలు తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు మ‌హానాయ‌కుడు క‌నీసం ఆ న‌ష్టాలను భ‌ర్తీ చేయ‌డం మాట అటుంచితే కొత్త న‌ష్టాలు తీసుకొస్తుందేమో అనే అనుమానాలు మొదలయ్యాయి.