స్టార్ హీరోయిన్ తో ‘మ‌హారాజ’ డైరెక్ట‌ర్ సినిమా .?

'Maharaja' director's movie with star heroine.?
'Maharaja' director's movie with star heroine.?

వ‌ర్స‌టైల్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తి కెరీర్ లో 50వ మూవీ గా తెరకెక్కిన ‘మ‌హారాజ’ బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. పూర్తి క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా వ‌చ్చిన ‘మ‌హారాజ’ మూవీ ని దర్శ‌కుడు నిథిల‌న్ సామినాథ‌న్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ లో విజ‌య్ సేతుపతి యాక్టింగ్ తో పాటు స్క్రిన్ ప్లేకు మంచి మార్కులు కూడా ప‌డ్డాయి.

'Maharaja' director's movie with star heroine.?
‘Maharaja’ director’s movie with star heroine.?

ఈ మూవీ ను ద‌ర్శ‌కుడు నిథిల‌న్ సామినాథ‌న్ మ‌లిచిన తీరుకి ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. దీంతో ఈ మూవీ సాలిడ్ వ‌సూళ్ల‌తో మంచి విజ‌యాన్ని అందుకున్నది . ఇక ఈ మూవీ త‌రువాత నిథిల‌న్ తన నెక్ట్స్ ప్రాజెక్టుని రెడీ చేసే ప‌నిలో ప‌డ్డాడ‌ట‌. ఇప్పటికే త‌న నెక్ట్స్ సినిమా కి సంబంధించి ఒక స్టోరీలైన్ ను స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార‌కు వినిపించాడ‌ట ఈ డైరెక్ట‌ర్.

లేడీ ఓరియెంటెడ్ మూవీ కావ‌డం, స్టోరీలైన్ కూడా సూప‌ర్ గా ఉండ‌టంతో నయ‌న‌తార ఈ మూవీ కు ఓకే చెప్పింద‌ట‌. దీంతో ఈ మూవీ స్క్రిప్టును పూర్తి చేసే ప‌నిలో చాలా బిజీగా ఉన్నాడ‌ట ఈ డైరెక్ట‌ర్. ఇక‌ న‌య‌నతార త్వ‌ర‌లోనే ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ లో న‌టించ‌నుంద‌నే టాక్ సినీ వ‌ర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. మ‌రి ఈ మూవీ కు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.