మహారాష్ట్ర వరదలు…జెనీలియా ఉదారం !

Maharashtra floods ... Genelia is generous!

తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమయిన నటి జెనీలియా మరాఠా నటుడు, మహారాష్ట్ర మాజీ సీఎం విలాష్‌రావ్ దేశ్‌ముఖ్ తనయుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. రితేష్‌తో వివాహం జరిగిన తరవాత జెనీలియా సినిమాలకు దూరమైపోయారు.

పెద్ద కుటుంబానికి కోడలిగా వెళ్లిన జెనీలియా అత్తింటి గౌరవం కాపాడేలా చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు. భర్త రితేష్, కొడుకులు రియాన్‌, రాహిల్‌‌లతో కలిసి జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటున్నారు.

ఇటీవల మహారాష్ట్రను భారీ వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకునే ఉన్నాయి. అయితే.. జెనీలియా, ఆమె భర్త రితేష్ దేశ్‌ముఖ్ కలిసి మహారాష్ట్ర వరద బాధితుల కోసం భారీ విరాళాన్ని అందించారు.

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షలు దానం చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను స్వయంగా కలిసిన ఈ దేశ్‌ముఖ్ జంట చెక్‌ను ఆయనకు అందజేశారు. ఈ విషయాన్ని ఫడ్నవీస్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఫొటో కూడా షేర్ చేశారు.