Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ముంబై దేశ ఆర్థిక రాజధాని. అయినా సరే ఇక్కడ కూడా ఎమ్మెల్యేలంటే భయం ఉంది. మహారాష్ట్ర ఎమ్మెల్యేలకు జనంలో ఎంత మంచి పేరుందో ప్రభుత్వం ఇచ్చిన ఓ ప్రకటనతో తేటతెల్లమైంది. ఎమ్మెల్యేలకు ఫ్లాట్లు అద్దెకివ్వాలని గవర్నమెంట్ ఇచ్చిన యాడ్ కు అసలు స్పందనే లేదు. ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉన్న ఫ్లాట్లు శిథిలావస్థకు చేరడంతో.. వారికి కొత్త ప్లాట్లు అద్దెకు తీసుకోవాలని ఫడ్నవీస్ సర్కారు భావించింది.
కానీ స్పందన లేకపోవడంతో వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ప్రభుత్వమే అద్దె ఇస్తుందని చెప్పినా.. ఎవరూ ముందుకు రాకపోవడానికి చాలా కారణాలున్నాయని అధికారులు చెబుతున్నారు.
అసలు ఎమ్మెల్యేని అద్దె అడిగే సాహసం ఎవరు చేస్తారనేది మొదటి పాయింట్. ఇక రెండోది గవర్నమెంట్ అద్దె ఇస్తుందనే నమ్మకం కూడా చాలా మందికి లేదు. అందుకే కష్టపడి కోట్లు పోసి కట్టుకున్న ఫ్లాట్లు ఉచితంగా అద్దెలకు ఇవ్వడం ఎందుకని, ఎమ్మెల్యేలంటేనే బిల్డర్లు పారిపోతున్నారు. మరి ఇప్పటికైనా ఎమ్మెల్యేలు తీరుమార్చుకుంటారని ఆశించడం అత్యాశేనేమో.
మరిన్ని వార్తలు: