దుమ్మురేపుతున్న మహర్షి కలెక్షన్స్

మహేశ్ బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ‘మహర్షి’ సినిమా, ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని ప్రాంతాల్లోను ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్ల పరంగా తన సత్తా చాటుకుంటోంది. ముఖ్యంగా నైజామ్ లో ఈ సినిమా వసూళ్ల పరంగా దుమ్మురేపేస్తోంది. ఏరియాలవారీగా చూసుకుంటే తొలి నాలుగు రోజుల్లో ఈ సినిమా నైజామ్ లో 16.61 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇంతవరకూ ఒక్క ‘బాహుబలి 2’కి మాత్రమే ఈ స్థాయి వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ఇక ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమా ‘గుంటూరు’ లో 5.90 కోట్ల షేర్ ను .. కృష్ణా లో 3.60 కోట్ల షేర్ ను .. ‘నెల్లూరు’లో 1.74 కోట్ల షేర్ ను రాబట్టింది.