మన్మధుడుకి పెద్ద సినిమా భయం ?

Nagarjuna Gives Chance Again To Kalyan Krishna For Soggade Chinni Nayana Movie Sequel

నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున సొంత బ్యానర్లో నిర్మితమవుతోన్న సినిమా ‘మన్మథుడు 2’. ఈ సినిమాలో ఆయన సరసన రకుల్ నటిస్తోంది. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగు ‘పోర్చుగల్’ లో జరుగుతోంది. నిన్నటితో అక్కడి షెడ్యూల్ కూడా పూర్తయింది. ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. ఇక ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ మొదలుకానుంది. ఈ సినిమాలో సమంత కన్నడ బ్యూటీ అక్షర గౌడ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాను, దసరా కంటే ముందే విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారని సమాచారం. ఆగష్టులో సాహో కూడా ఉన్న నేపధ్యంలో జూలై నెలో ఈ సినిమా రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు.