మహేష్ – వెంకటేష్ లతో త్రివిక్రమ్ మల్టీ స్టారర్ మూవీ..?

Mahesh and Venkatesh multi starrer movie in trivikram direction

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ లో ఒకరు త్రివిక్రమ్ శ్రీనివాస్… వరుస హిట్లతో తన ట్రేడ్ మార్క్ తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ హీరోగా అజ్ఞాతవాసి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొత్తం ఈ మధ్యే ఫినిష్ అయింది. పవన్ కళ్యాణ్ 25 చిత్రం కావటంతో అజ్ఞాతవాసి సినిమా ప్రమోషన్ ను త్రివిక్రమ్ పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. అజ్ఞాతవాసి సినిమా టీజర్ ను డిసెంబర్ 16, ఆడియోను డిసెంబర్ 19 న రిలీజ్ చేసి, సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమాను రిలీజ్ చేయటానికి త్రివిక్రమ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాడు.

NTR in trivikram direction

ఇంకా ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తో ఒక సినిమాను ప్రారంభించనున్నాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఒక విభిన్నమైన క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ సినిమా తర్వాత వెంకటేష్ తో త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడు. ఈ విషయాన్ని వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా ఒక పోస్టర్ ని రిలీజ్ చేయటం కూడా జరిగింది. కానీ ఫిలిం నగర్ లో ఒక ఆసక్తికరమైన వార్త హల్ చల్ చేస్తుంది.

Mahesh-nd-Venkatesh-Multist

ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వెంకటేష్ తో పాటు మహేష్ కూడా ఈ సినిమాలో నటించబోతున్నాడు. ఈ మల్టీ స్టారర్ చిత్రంలో వెంకటేష్, మహేష్ బాబులు హీరోలుగా నటించనున్నారట. గతంలో ఈ ఇద్దరు హీరోలుగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి ఆ కాంబినేషన్ ను రిపీట్ చేసేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున‍్నారట. ఇప్పటికే ఈ విషయాన్ని త్రివిక్రమ్ మహేష్, వెంకటేష్ కి చెప్పటం… వారిద్దరూ ఓకే చెప్పటం కూడా జరిగిపోయిందంటా. ఇప్పటికే మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా మూవీస్ వచ్చాయి. ఈ మల్టీ స్టారర్ చిత్రం గనుక నిజమైతే, ఈ చిత్రం టాలీవుడ్ లో రికార్డులు సృష్టించడం ఖాయం…