సూపర్ స్టార్ మహేష్‌బాబు 25వ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలకు రంగం సిద్దం అయ్యింది. రేపు మహేష్ పుట్టిన రోజు సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు చిత్ర ఫస్ట్‌లుక్ విడుదల చేయబోతున్నారు. వంశీ పైడిపల్లి ఒక అద్బుతమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా మొదటి నుండి చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ చిత్రం పట్ల మహేష్‌బాబు కూడా చాలా ఆసక్తిగా ఉన్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ చిత్రంలో కనిపించేందుకు మహేష్‌బాబు గడ్డం మీసాలు పెంచాడు. సినీ కెరీర్ ప్రారంభించిన ఇన్నాళ్లకు మహేష్‌బాబు గడ్డంతో కనిపించబోతున్నాడు. ఇక ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంకు ‘రిషి’ అంటూ టైటిల్‌ను ఖరారు చేసే అవకాశం ఉంది అంటూ వంశీ పైడిపల్లి విడుద చేసిన అక్షరాల ఆధారంగా ఫ్యాన్స్ అంచనా వేశారు.
మహేష్‌బాబుకు రెండు అక్షరాల టైటిల్స్ అచ్చిరావని, ఆయన గతంలో చేసిన వంశీ మరియు నిజం చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో రిషి టైటిల్‌కు ఫ్యాన్స్ వ్యతిరేకంగా స్పందించారు. ఆ కారణంగానే దర్శకుడు వంశీ పైడిపల్లి వెనక్కు తగ్గినట్లుగా సమాచారం అందుతుంది. రిషి టైటిల్ అనుకుని మళ్లీ టైటిల్‌ను ఇప్పుడు ప్రకటించడం లేదని, ప్రస్తుతం కేవలం మహేష్‌బాబు లుక్‌ను మాత్రమే రివీల్ చేయబోతున్నట్లుగా చెప్పుకొచ్చారు. అయితే కొందరు మాత్రం రిషి టైటిల్ ఫైనల్ అంటున్నారు. మొత్తానికి మహేష్‌బాబు 25వ చిత్రం టైటిల్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. రిషి ఖరారు అయితే ఫస్ట్‌లుక్‌లో రిషి టైటిల్ లోగో ఉండే అవకాశం ఉంది. ఆ టైటిల్ కాకుంటే కేవలం సినిమా లుక్ మాత్రమే రివీల్ అయ్యే అవకాశం ఉందని సినీవర్గాల వారు అంటున్నారు. మరికొన్ని గంటల్లో ఈ విషయమై అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.