సూపర్‌స్టార్ మహేష్‌బాబు 25వ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు మరియు అశ్వినీదత్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంను మొదట సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. అయితే చిత్రం షూటింగ్ అనుకున్నంత వేగంగా సాగడం లేదు, దాంతో పాటు చిత్రీకరణ అనుకున్న టైం కంటే ఆలస్యంగా ప్రారంభం అయ్యింది. అందుకే సినిమాను ఆలస్యంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు నిర్ణయించుకున్నారు. నిన్న మొన్నటి వరకు చిత్రాన్ని వేసవిలో విడుదల చేస్తాం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతూ వచ్చారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిత్రం విడుదల తేదీ ఏప్రిల్ 5 అని తెలుస్తోంది.
మహేష్‌బాబు 25వ చిత్రం విడుదలకు పది నెలల ముందే డేట్ ఫిక్స్ అవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. భరత్ అనే నేను చిత్రం మొన్న వేసవిలో దున్నేసింది. అందుకే సమ్మర్ సెంటిమెంట్‌ను ఫాలో అయ్యి ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేసి, భారీ వసూళ్లను సాధించాలని మహేష్‌బాబు భావిస్తున్నాడు. ఉగాది రోజే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘మహేష్25’ చిత్రం ఏ రేంజ్ రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి. ఈచిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తుండగా, ఒక కీలక పాత్రలో అల్లరి నరేష్ కనిపించబోతున్నాడు. మహేష్‌బాబు మూవీలో అల్లరి నరేష్ అనగానే అంచనాలు భారీగా వస్తున్నాయి. వీరిద్దరి కాంబో సీన్స్ ఎలా ఉంటాయి, అసలు వీరిద్దరు సినిమాలో ఎలా కనిపిస్తారు అంటూ సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. సినిమా తప్పకుండా భారీ బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకంను మహేష్ బాబు ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.






