Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ మహేష్‌బాబు సోదరి మంజుల దర్శకత్వంలో తెరకెక్కిన ‘మనసుకు నచ్చింది’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్‌గా నిలిచింది. యూత్ ఫుల్ లవ్‌స్టోరీ అంటూ ప్రచారం చేసిన మంజుల ఈ చిత్రంతో యూత్‌ను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యింది. సందీప్ కిషన్ కెరీర్లో మరో డిజాస్టర్‌గా ఈ చిత్రం నిలిచింది. మంజుల గతంలో నటిగా, నిర్మాతగా కూడా సక్సెస్ కాలేక పోయింది. తాజాగా దర్శకత్వంతో అయినా సక్సెస్‌ను దక్కించుకుంటుందేమో అని అంతా భావించారు. కాని షాకింగ్‌గా మంజుల దర్శకత్వంలో కూడా రాణించలేక పోయింది. మహేష్‌బాబు పబ్లిసిటీ చేసినా కూడా సినిమాకు పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.
ఈ చిత్రం తర్వాత మంజుల దర్శకత్వం జోలికి వెళ్లకుంటే మంచిది అనే అభిప్రాయం ఎక్కువ శాతం మంది వ్యక్తం చేస్తున్నారు. అయితే మహేష్ బాబు మాత్రం లవ్ స్టోరీలు కాకుండా విభిన్న కథాంశంతో సినిమాలను ప్రయత్నించాలని, తప్పకుండా దర్శకురాలిగా మంచి సక్సెస్ అవుతావు అంటూ సోదరికి సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దాంతో ప్రస్తుతం మంజుల ఒక విభిన్న జోనర్లో సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ను కూడా అప్పుడే మహేష్ మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. మంజుల ద్వితీయ ప్రయత్నం అయినా సక్సెస్ అవుతుందా లేదా అనేది చూడాలి.