మహేష్ తర్వాత అక్కడకు వెళ్లబోతున్నాడు…!

Mahesh Babu Family Meet Sania Mirza Family

మహేష్ బాబు నెక్స్ట్ టూర్ పొల్లాచి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మహర్షి అనే చిత్రం రూపొందుతుంది. మొదట ఈ చిత్రం న్యూ యార్క్ లో వన్ మంత్ పాటు షూటింగ్ జరుపుకుంది. ఆ షెడ్యూల్ లో మహేష్ బాబు ఓ స్టార్ హోటల్ కి సి.ఈ.ఓ గా నటిస్తున్నాడు. ఆ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని ఇండియాకు వచ్చిన మహర్షీ టీం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టుడియోలో ఓ విలేజ్ సెట్ లో షూటింగ్ జరుపుకుంది. ఇండియా షెడ్యూల్ లో మహేష్ బాబు ఓ రైతుగా నటిస్తున్నట్లు సమాచారం. న్యూ ఇయర్ ను పురస్కరించుకుని మహర్షి మూవీ టీం కొంత బ్రేక్ ఇచ్చింది. ఆ సమయంలో మహేష్ బాబు దుబాయ్ కి ఫ్యామిలీ తో పాటుగా వెళ్ళాడు.

న్యూ ఇయర్ ను కూడా అక్కడే జరుపుకున్నాడు. అక్కడే ఉన్న సానియా మీర్జా ఫ్యామిలీ ని మహేష్ అండ్ ఫ్యామిలీ కలిసింది. దానికి సంబందించిన మహేష్ బాబు ఫొటోస్ సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి. ఇకా దుబాయ్ నుండి మహేష్ బాబు ఈ వారంలో ఇండియాకు వస్తున్నాడు. ఆ తరువాత మహేష్ మహర్షీ సినిమా షూటింగ్లో పాల్గ్గొంటాడు. నెక్స్ట్ షెడ్యూల్ ను పొల్లాచి లో జరిపేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. అందుకు సంబందించిన పనులు దాదాపుగా జతుగు తున్నాయి. పొల్లాచి లో లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. మహర్షి చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయకగా నటిస్తుంది. అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో కనిపిస్తాడు. దిల్ రాజ్ అశ్వినీ దత్త్ సంయుక్తంగా ఈ చిత్రాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాని ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్రా బృందం సన్నాహాలు చేస్తుంది.