‘నాని’ని ఇంకా మర్చిపోని మహేష్‌ ఫ్యాన్స్‌

mahesh-babu-fans-fires-on-sj-surya

పవన్‌ కళ్యాణ్‌తో ‘ఖుషీ’ వంటి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ చిత్రాన్ని తెరకెక్కించిన ఎస్‌జే సూర్య మహేష్‌బాబుతో ఎప్పటికి మర్చిపోలేని ‘నాని’ వంటి అట్టర్‌ ఫ్లాప్‌ సినిమాను తెరకెక్కించిన విషయం తెల్సిందే. పవన్‌కు సూపర్‌ హిట్‌ ఇచ్చి, మహేష్‌కు ఫ్లాప్‌ సినిమా ఇచ్చాడు అనే కోపంతో సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ ఇప్పటికి కూడా ఎస్‌జే సూర్యను టార్గెట్‌ చేస్తూనే ఉన్నారు. మహేష్‌బాబుకు తనకు ఫ్లాప్‌ ఇచ్చిన సూర్యతో స్పైడర్‌ చిత్రంలో కలిసి వర్క్‌ చేశాడు. మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్పైడర్‌’ చిత్రంలో ఎస్‌జే సూర్య విలన్‌గా నటించిన విషయం తెల్సిందే.

తాజాగా ‘స్పైడర్‌’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక జరిగింది. ఈ వేడుకలో భాగంగా ఎస్‌జే సూర్య మాట్లాడబోతుండగా సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ అడ్డుకున్నారు. నాని వంటి సినిమాను మహేష్‌కు ఇచ్చిన మీరు మాట్లాడొద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నిమిషాలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరినప్పటికి ఫ్యాన్స్‌ మాత్రం ఎంతకు మొత్తుకోవడం ఆపలేదు. చేతు అడ్డంగా ఊపుతూ ఎస్‌జే సూర్యకు నిరసన తెలిపారు. దాంతో అసహనం వ్యక్తం చేసిన ఎస్‌జేసూర్య వెనుదిరగబోతుండగా, సుమ కల్పించుకుని సూర్య గారు ఏం మాట్లాడుతారో వినాలని మహేష్‌బాబు గారు కోరుకుంటున్నారు, మనం కూడా విందాం అంటూ సుమ చెప్పడంతో అప్పుడు కాస్త ఫ్యాన్స్‌ సైలెంట్‌ అయ్యారు. నాని సినిమా వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా ఫ్యాన్స్‌ ఈ స్థాయిలో దర్శకుడిపై ఆగ్రహంతో ఉన్నారు అంటూ సినీ వర్గాల వారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.