Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ మహేష్‌బాబు, మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘స్పైడర్’ చిత్రం దసరా కానుకగా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకే సారి విడుదల చేసేందుకు మురుగదాస్ ప్రయత్నాలు చేస్తున్నాడు. తెలుగులో ఈ చిత్రం గురించి పబ్లిసిటీ చేయనక్కర్లేదు. ఇప్పటికే భారీ అంచనాలు ‘స్పైడర్’ చిత్రంపై ఉన్నాయి. ఆ అంచనాలను ఇంకాస్త పెంచేందుకు బిగ్‌బాస్ ఇంటికి మహేష్‌బాబు వెళ్లబోతున్నట్లుగా మూడు నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే అందులో సగం నిజం ఉంది, సగం తప్పుంది.
నిజం ఏంటి అంటే మహేష్‌బాబు బిగ్‌బాస్ ఇంటికి వెళ్లడం. మరి తప్పు ఏంటో తెలుసా అది తెలుగు బిగ్‌బాస్ షో కాదు తమిళ బిగ్‌బాస్ షో అవ్వడం. అవును తమిళంలో ‘స్పైడర్’ను ప్రమోట్ చేసేందుకు స్వయంగా మహేష్‌బాబు అక్కడ రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. వీలుంటే మహేష్‌బాబు, మురుగదాస్ లేదా మహేష్‌బాబు తమిళ బిగ్‌బాస్ ఇంటికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళ ఆడియన్స్‌లో ప్రస్తుతం బిగ్‌బాస్‌పై భారీ ఆసక్తి ఉంది. ఆ కారణంగానే స్పైడర్ చిత్రాన్ని బిగ్‌బాస్ వేదికగా ప్రమోట్ చేయడం ద్వారా తప్పకుండా తమిళనాట ప్రేక్షకులను ఈ చిత్రం చేరుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ విషయం తెలుగు అభిమానులకు కాస్త నిరాశను కలిగించే విషయమే. తెలుగు బిగ్‌బాస్ షోలో మహేష్ కనిపిస్తాడని ఊహించిన ప్రేక్షకులు ఇప్పుడు నిరాశ చెందుతున్నారు.
మరిన్ని వార్తలు: