Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘భరత్ అనే నేను’ మూవీలో ముఖ్యమంత్రి పాత్రలో నటించిన మహేష్ అద్భుత నటన కనబరచగా ఆయనకి అనేక ప్రశంసలు వస్తున్న విషయం తెలిసిందే. ఈమూవీలో ముఖ్యమంత్రి ‘భరత్’ పాత్రలో స్తేబుల్డ్ గా కనిపించిన మహేష్ ‘మేడమ్ స్పీకర్’ అంటూ ఒక డిఫరెంట్ మాడ్యులేషన్ లో చెప్పిన డైలాగ్ కొత్తగా ఉండటమే కాక ఆ డైలాగ్ వింటుంటే మహేష్ అభిమానులకి వెంట్రుకలు సైతం నిక్కబొడుచుకుంటున్నాయట. అయితే అసలు ఇదేమి పదం మహేష్ దీనిని ఎందుకు పలికాడా అని ఆరా తీస్తే కొన్ని ఆసక్తికర విషయాలని బయటపెట్టాడు మహేష్.
ఈ మేడమ్ స్పీకర్ పదాన్ని మహేష్ గంభీరంగా పలకడం వెనుక మహేష్ బావ తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ ప్రభావం ఉందట. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు ఎంపీ అయిన గల్లా జయదేవ్ పార్లమెంట్ సమావేశాలలో మాట్లాడే సందర్భంలో ‘మేడమ్’ అన్న పదాన్ని ఎంత గంభీరంగా అన్నారో తానూ అనేక సార్లు పరిశీలించానని అలాగే ఈ సినిమాలో భరత్ లండన్ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తిగా కనిపించే నేపధ్యంలో తన ఇంగ్లీష్ స్లాంగ్ విషయంలో బ్రిటీష్ ఇంగ్లీష్ స్లాంగ్ లా ఉండటం కోసం బ్రిటీష్ పార్లమెంట్ లో ఆ దేశ పార్లమెంట్ మెంబర్స్ ఏవిధంగా మాట్లాడుతారు ఆ సందర్భంలో ఏ విధంగా వారి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది అన్న విషయమై రీసర్చ్ చేయడానికి అనేక వీడియోలను తాను కొరటాలతో కలిపి చూసి చివరకి మేడం స్పీకర్ అనే పదాన్ని ఫిక్స్ చేసినట్లు తెలిపాడు మహేష్.