మరి కొన్ని రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహం మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఫేమస్ సెలబ్రిటీస్ మధ్యకి వెళ్లనున్నది. ప్రఖ్యాతగాంచిన వివిధ వ్యక్తుల మైనపు విగ్రహాలను తయారుచేయడం మేడం టుస్సాడ్స్ టీంకి అలవాటు. అలా, వారి పరిగణలోకి వెళ్ళిన వారు మన సూపర్ స్టార్ మహేష్. మహేష్ కి ఉన్న క్రేజ్ కి వారు వచ్చి సూపర్ స్టార్ ని కలవడం, కొన్ని కొలతలు తీసుకోవడం గురించి ఏప్రిల్ లో మహేష్ బాబు స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. మహేష్ బాబు స్వయంగా తానే వెళ్లి అక్కడి అధికారులని కలిసి ధన్యవాదాలను తెలుపారు. అయితే, ఆయన ఏ క్యారెక్టర్ ని కాకుండా డైరెక్ట్ గా ఆయన బయట ఉండే విధంగానే మైనపు విగ్రహాన్ని చేయబోతున్నారు.
అయితే ఇప్పుడు అది తయారీ ప్రక్రియలో ఉంది, ముఖభాగం ఫోటోలు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్నాయ్. దీన్ని తీర్చి దిద్దుతున్నది ఆ సంస్థకు చెందిన ఇవాన్ రీస్ అనే శిల్పకారుడు ఆధ్వర్యంలో. అయితే ఆ ముఖ పోలికలు చాలా దగ్గరగా ఉండడం చాలా విశేషం. అక్కడున్న శిల్పకారులు వాటికి ప్రసిద్ధి మరి. మనందరికీ తెలిసిన విషయమే ప్రభాస్ అమరేంద్ర బాహుబలి రూపంలో ఉన్న మైనపు విగ్రహాన్ని అక్కడ ఇంతక ముందే పెట్టడం జరిగింది. అందులోనూ, ఆ ఘనతను సాధించిన మొదటి దక్షిణ భారతదేశపు వ్యక్తి ప్రభాస్ కావడం విశేషం. ఇప్పుడు మహేష్ బాబు రెండో వ్యక్తి. అయితే, ఇంతకు ముందు ఆ గౌరవాన్ని సంపాందించిన భారతీయులు మహాత్మా గాంధీ, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య బచ్చన్, సచిన్ టెండూల్కర్ , షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, మాధురీ దీక్షిత్, కరీనా కపూర్, కత్రీనా కైఫ్, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, విరాట్ కోహ్లీ, ప్రభాస్, వరుణ్ ధావన్, ఇప్పుడు మహేష్ బాబు. ఏది ఏమయినా భారతీయుల గౌరవం మరో సారి మన తెలుగు హీరో ద్వారా ఇంకాస్త పెరగడం గర్వకారణమే.